Site icon NTV Telugu

OTT : హనీమూన్ సే హత్య – డ్రమ్ములో భర్త శవం ముక్కలు – రియల్ క్రైమ్ స్టోరీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Honeymoon Se Hatya, Honeymoon Murder Case, Real Crime Ott Series,

Honeymoon Se Hatya, Honeymoon Murder Case, Real Crime Ott Series,

ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో రియల్ క్రైమ్ డాక్యుమెంటరీలకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దారుణ హత్యల నేపథ్యంలో ‘హనీమూన్ సే హత్య’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా మీరట్‌లో జరిగిన ఒక భయంకర ఘటన ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలవనుంది. మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్, తన ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. అతని శరీరాన్ని ముక్కలుగా నరికి ఒక బ్లూ కలర్ డ్రమ్ములో దాచిపెట్టింది. చివరికి తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ చిన్నారి కూతురు చెప్పడంతో ఈ ఘోరం బయటపడింది. ఇలాంటి మరిన్ని వాస్తవ సంఘటనలను దర్శకుడు అజితేష్ శర్మ ఎంతో కళ్లకు కట్టినట్లు ఈ సిరీస్‌లో చూపించారు.

మరోవైపు ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ఉదంతం కూడా ఇందులో చోటుచేసుకుంది. పెళ్లైన కొత్తలో భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లిన భార్య సోనమ్, ప్రియుడితో కలిసి పథకం ప్రకారం అతడిని అంతం చేసింది. సుమారు 11 రోజుల తర్వాత ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం ఈ రెండు కేసులే కాకుండా, దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన మరో మూడు యదార్థ గాథలను కూడా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగం చేశారు. నేరస్తుల మానసిక స్థితి, వారు హత్యలకు పాల్పడిన తీరును వివరిస్తూ సాగే ఈ ‘హనీమూన్ సే హత్య’ సిరీస్, ఈ నెల 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది ఒక షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.

Exit mobile version