హనీ రోజ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలయ్య నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ వీరసింహారెడ్డి లో నటించింది.. సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది.. సినిమాల్లో నటించకపోయినా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతను తెగ ఆకట్టుకుంటుంది.. తాజాగా మరోసారి గ్లామర్ షో చేసింది.. వైట్ డ్రెస్సులో అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. కంప్లీట్ వైట్ డ్రెస్ లో భారీ సొగసుతూ ఊపేస్తూ కుర్రాళ్ళని మైకంలో ముంచేసింది. నడుము సొగసు చూపిస్తూ అందంగా నడుచుకుంటూ వస్తున్న హనీ రోజ్ ఫోజులు మెరుపులు మెరిపించేలా ఉన్నాయి. హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు.. హనీ రోజ్ వైట్ డ్రెస్ లో నడచి వస్తుంటే రాజహంస కదిలినట్లే ఉందని కుర్రకారు ఆమెపై పొగడ్తల బాణాలు సంధిస్తున్నారు.. అబ్బా ఏం అందం రా మామా అంటూ తెగ ఫిదా అవుతున్నారు..
అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు హనీ రోజు నేలపై నడిచే బొమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఇక ఈ అమ్మడు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ రోజుకో ప్రాంతంలో దర్శనమిస్తూ కుర్రకారుకు కన్నుల విందు చేస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుక తర్వాత సక్సెస్ పార్టీలో హనీ రోజ్ బాలయ్యతో కలసి మద్యం సేవించడం వివాదం సృష్టించిన సాంగతి తెలిసిందే. ఇద్దరూ చేతులు పెనవేసుకుని డ్రింక్ తాగారు. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చెయ్యలేదు.. మళ్లీ బాలయ్య తోనే జత కడుతుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అంతేకాదు మరో సినిమాలో నటిస్తుందని సమాచారం..