Site icon NTV Telugu

Honda Elite Pack: హోండా అమేజ్, ఎలివేట్‌కు “ఎలైట్ ప్యాక్” విడుదల.. కొత్తగా వస్తున్న ఫీచర్లు ఇవే!

Honda

Honda

Honda Elite Pack: హోండా కార్స్ ఇండియా తమ పాపులర్ కార్లు సెడాన్ హోండా అమేజ్ (Honda Amaze), ఎస్యూవీ హోండా ఎలివేట్ (Honda Elevate) మోడళ్లకు “ఎలైట్ ప్యాక్” (Elite Pack) పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ వెర్షన్లకు భిన్నంగా, ఈ కొత్త ప్యాక్‌లో కొన్ని అదనపు ఫీచర్లను వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తున్నారు. ఈ ఆఫర్ “ద గ్రేట్ హోండా ఫెస్ట్” (The Great Honda Fest) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చారు.

ఈ ఎలైట్ ప్యాక్‌లో 360 డిగ్రీ కెమెరా, సెవన్ కలర్ అంబియెంట్ లైటింగ్ లాంటి కీలక ఫీచర్లు ఉచితంగా లభిస్తున్నాయి. ఇవి గత వర్షన్లలో లేకపోయినా, ఇప్పుడు అదనంగా ఇస్తున్నారు. అంతేకాకుండా, కొన్ని వేరియంట్లకు డీలర్ వద్ద యాక్సెసరీగా 360 డిగ్రీ కెమెరాను ఫిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ సదుపాయం మూడవ పార్టీ సప్లయర్ ద్వారా ఇన్స్టాల్ చేయబడుతుంది. అలాగే ఇది 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

Mani Shankar Aiyar: ‘‘పాకిస్తాన్‌ను ఎవరూ నిందించడం లేదు’’..కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్..

ప్రస్తుతం అమేజ్, ఎలివేట్, సిటీ మోడళ్లపై హోండా సంస్థ “గ్రేట్ హోండా ఫెస్ట్” పేరుతో ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు వేరియంట్ మరియు మోడల్‌పై ఆధారపడి మారవచ్చు మరియు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అన్ని ఆథరైజేడ్ హోండా డీలర్ షోరూమ్‌లలో ఈ ప్రత్యేక ఫీచర్లు, ఆఫర్లు లభ్యం అవుతాయి.

Yamaha MT-15 V2.0: యామహా MT-15 V2.0 (2025) విడుదల.. ధర, ఫీచర్లు వివరాలు ఇలా!

ఇక ధరల విషయానికొస్తే, హోండా ఎలివేట్ SUV ప్రారంభ ధర రూ.11.91 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, ఇది హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టాస్ లాంటి కార్లతో పోటీ పడుతుంది. హోండా అమేజ్ సెడాన్ ప్రారంభ ధర రూ.8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది మారుతి డిజైర్, హ్యుండాయ్ ఔరా, టాటా టిగోర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మొత్తంగా చూస్తే, టెక్నాలజీ, కంఫర్ట్ ఇంకా స్టైల్‌కి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం హోండా ఈ ఎలైట్ ప్యాక్ రూపంలో మరింత విలువను కలిగించే ప్రయోజనాన్ని తీసుకొచ్చింది.

Exit mobile version