Site icon NTV Telugu

బైక్ లవర్స్కి గుడ్న్యూస్.. ఏకంగా, రూ.1 లక్ష డిస్కౌంట్‌తో Honda CB750 Hornet..

Honda

Honda

Honda CB750 Hornet: భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన బిగ్ వింగ్ షోరూమ్‌లలో హోండా మధ్యతరహా నేకడ్ బైక్ Honda CB750 Hornet పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కంపెనీ 2025 మోడల్ (MY2025) స్టాక్‌పై గరిష్టంగా రూ.1 లక్ష వరకు తగ్గించినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుంది అని కండీషన్ పెట్టింది. డీలర్‌షిప్‌ను బట్టి డిస్కౌంట్ మారే అవకాశం ఉందని పేర్కొనింది.

Read Also: India vs Pakistan: “వర్షం పడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను”.. పాక్ మాజీ ప్లేయర్ మాస్టర్ ప్లాన్..

ఇక, ఈ బైక్ ప్రారంభంలో రూ.8.59 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరకు విడుదల అయింది. అనంతరం GST 2.0 అమలుతో ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్‌తో ధర గణనీయంగా తగ్గి, మధ్యతరహా నేకడ్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి చాయిస్ కానుంది. కొత్త మోడల్ స్టాక్ రాక ముందే పాత స్టాక్ క్లియర్ చేయడానికే ఈ ఆఫర్ ప్రకటించినట్లు డీలర్ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలు చేయాలనుకునేవారు తమకు సమీపంలోని హోండా BigWing షోరూమ్‌ను సంప్రదించాలని తెలిపారు.

Read Also: Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్

ఇంజిన్:
* CB750 Hornet లో 755 సీసీ పరల్లెల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 9,500 ఆర్పీఎం దగ్గర 90.5 బీహెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 75 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్ ఇవ్వబడింది.

ఫీచర్లు:
* స్టీల్ డైమండ్ ఫ్రేమ్
* USD ఫ్రంట్ ఫోర్క్స్
* రియర్ మోనోషాక్
* డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు
* రియర్ సింగిల్ డిస్క్
* డ్యూయల్ ఛానల్ ABS
* LED లైటింగ్
* 5 అంగుళాల TFT డిస్‌ప్లే (స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో)
* మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు
* ట్రాక్షన్ కంట్రోల్
* రైడ్-బై-వైర్ థ్రాటిల్

కాగా, మిడిల్ నేకడ్ సెగ్మెంట్‌లో ఈ బైక్‌కు Yamaha MT-07, Triumph Trident 660, Suzuki GSX-8S లాంటి మోడళ్లు పోటీగా ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ కారణంగా ప్రస్తుతం CB750 Hornetకి ఫుల్ డిమాండ్ ఏర్పాడే అవకాశం ఉందని టాక్.

Exit mobile version