NTV Telugu Site icon

Honda Activa 7G Launch: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్‌ తెలిస్తే మైండ్ బ్లాకే!

Honda Activa 7g

Honda Activa 7g

Honda Activa 7G Launch: ప్రస్తుతం భారత్‌లో బైక్‌లకు సమానంగా స్కూటీల అమ్మకాలు జరుగుతున్నాయి. స్కూటీల అమ్మకాలలో టీవీఎస్, హోండాలు పోటీ పడుతున్నాయి. టీవీఎస్ ఇటీవల జూపిటర్ 110ని విడుదల చేయగా.. యాక్టివా 7జీని రిలీజ్ చేసేందుకు హోండా సిద్ధమవుతోంది. హోండా కంపెనీ ఇదివరకే 4జీ, 5జీ, 6జీ స్కూటీలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వాటికి మంచి ఆదరణ దక్కడంతో 7జీని అతి త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

యాక్టీవా 7జీని హోండా కంపెనీ జనవరి 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ ఈ స్కూటీ లాంచింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యాక్టివా 7జీ వేరియంట్‌ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 55 నుంచి 60 కిమీ వరకు మైలేజ్ ఇస్తుందట. ఇక యాక్టివా 7జీ ధర రూ.90 వేల వరకు (ఎక్స్‌ షోరూమ్‌) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: Asia Cup 2024: అక్టోబర్ 19న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ!

యాక్టీవా 7జీలో అధునాతన టెక్నాలజీకి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. డిజిటల్‌ స్క్రీన్‌, మొబైల్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జర్‌ను అందించనున్నారు. ఎల్‌ఈడీ లైట్స్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. కారుల్లో ఉన్న పుష్‌ బటన్ స్టార్ట్ ఫీచర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. సైలెంట్ స్టార్ట్‌ ఫీచర్, అలాయ్‌ వీల్స్‌తో ఈ స్కూటర్‌ను రిలీజ్ చేయనుంది. ఇది 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉండనుంది. ఈ ఇంజన్ 7.6bhp, 8.8Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. త్వరలోనే ఈ స్కూటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.