Site icon NTV Telugu

Cockroach: ఇంట్లోకి బొద్దింకలు వస్తున్నాయా.. ఈ 5 మార్గాలతో వాటిని వదిలించుకోండి

Cockroaches

Cockroaches

Cockroach: వర్షాకాలంలో ఇంట్లో బొద్దింకల భయం మొదలవుతుంది. ఇంట్లో ఎంత శుభ్రత ఉన్నా, వర్షంలో తేమ కారణంగా బొద్దింకలు విజృంభిస్తాయి. ఇంట్లో వంటగది, స్టోర్ రూమ్‌లో ఉండే బొద్దింకలు మిమ్మల్నీ బాగా ఇబ్బందిపెడతాయి, కొన్ని చిట్కాలతో మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. బొద్దింకలను వదిలించుకోవడానికి మార్కెట్లో అనేక రకాల మందులు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి రసాయనాలు, విషపూరితమైనవి. అటువంటి పరిస్థితిలో బొద్దింకలను వదిలించుకోవడానికి మీరు ఈ హోం మేడ్ చిట్కాలను పాటించి బొద్దింకలను తరిమేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

Read Also:Pakistan: పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆ దేశ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

– ఇంట్లో నుండి బొద్దింకలను తరిమికొట్టడానికి.. ఒక గిన్నె పిండిలో రెండు చెంచాల పంచదార, ఒక చెంచా పసుపు, రెండు చెంచాల బోరిక్ పౌడర్ కలిపి పేస్ట్ చేయండి. పేస్ట్ సిద్ధమైన తర్వాత, దానిని వంటగదిలోని స్లాబ్‌పై, బొద్దింకలు వచ్చే చోట రాయండి. ఈ పరిహారం బొద్దింకలను తరిమికొడుతుంది.
– వర్షాకాలంలో అపరిశుభ్రత వల్ల బొద్దింకలు విజృంభిస్తాయి. ఇలాంటప్పుడు ఒక గిన్నెలో వేపనూనె తీసుకుని ఇంట్లో స్ప్రే చేయాలి. దీన్ని ఇంట్లో చల్లితే బొద్దింకలు ఇంట్లోంచి పారిపోతాయి.
– బొద్దింకలు లవంగాల వాసన నుండి దూరంగా ఉంటాయి. కాబట్టి లవంగాలను ఇంటి మూలల్లో చల్లుకోండి. దాని వాసనతో వర్షంలో పెరిగే బొద్దింకలు, ఇతర కీటకాలు రావు.
– ఆకులను గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి ఇంట్లో చిలకరించాలి, ఇలా చేయడం వల్ల బొద్దింకలు ఇంట్లో నుండి మాయమవుతాయి.
– ఇంట్లో, వంటగదిలో శుభ్రత పాటించడం ద్వారా బొద్దింకలు పెరగకుండా నిరోధించవచ్చు.

Read Also:Fire Accident: వామ్మో.. ఎక్కడి మంటలు.. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైదాకా నిప్పుల కుంపటే

Exit mobile version