Home Guard Ravinder: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం హోంగార్డు అధికారుల ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు రవీందర్ ను హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రవీందర్ శరీరం అంతా ఇప్పటికే 75% కాలిపోయిందని, రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. విషయం తెలుసుకున్న రవీందర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే హాస్పిటల్ కు చేరుకున్నారు. రవీందర్ ను విగతదీవిగా చూసి బోరున ఏడ్చారు. అయితే రవీందర్ ఆత్మహత్యపై జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నంపై హోమ్ గార్డ్స్ అందరు హాస్పిటల్ కు రావాలని పిలుపు నిచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మానియా హాస్పిటల్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హోంగార్డులు ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
Read also: Udayanidhi: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడమేనా సనాతన ధర్మం అంటే ?
హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నం పై వెంటనే ప్రభుత్వo స్పందించాలని హోంగార్డు JAC సభ్యులు నారాయణ అన్నారు. రవీందర్ బ్రతకడం చాలా కష్టమన్నారు. రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల విధులు బహిష్కరణకు పిలుపు ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణకు హోంగార్డు జేఏసీ సభ్యులు కూడా మద్దుతు తెలపడంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు విధులు బహిష్కరిస్తామన్నారు. రేపట్నుంచి హోంగార్డులు ఎవ్వరు విధుల్లో ఉండకూడదని, తమ డిమాండ్ అను ప్రభుత్వం ఒప్పుకుంటేనే విధుల్లో వస్తామని కోరారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ వాతావరణం నెకలొంది.
Udayanidhi: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడమేనా సనాతన ధర్మం అంటే ?