Hombale Films : హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం..

Hombale Films

Hombale Films

భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి వంటి దర్శకులతో కలిసి భారీ విజయాలను అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధమైంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కీలక అడుగు వేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Also Read :Power Peta : రితికా నాయక్‌కు బంపర్ ఆఫర్..

‘సినిమా అనేది సరిహద్దులు లేని ఒక అనుభూతి. భారత్ నుంచి ప్రపంచానికి మన కథలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగాన్ని ప్రారంభిస్తోంది’ అని సోషల్ మీడియా వేదికగా వారు పేర్కొన్నారు. దీనివల్ల భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు విదేశాల్లో మరింత భారీ స్థాయిలో, పక్కా ప్రణాళికతో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో ‘కాంతార’, ‘సలార్ 2’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా రావడంతో, ఈ సినిమాల వసూళ్లు ఓవర్సీస్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం తమ సినిమాలే కాకుండా, ఇతర భాషల చిత్రాలను కూడా గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో హోంబలే ఫిల్మ్స్ కేవలం ప్రొడక్షన్ హౌస్‌గానే కాకుండా, ఒక గ్లోబల్ మీడియా పవర్‌హౌస్‌గా అవతరించబోతోంది.