Site icon NTV Telugu

Hombale Films : మ్యూజిక్ రంగంలో హోంబలే కొత్త అడుగు.. ‘శివ శంభో స్వయంభూ’ ప్రోమో అదిరిపోయింది!

Shiva Shambho Swayambho Song, Hombale Films

Shiva Shambho Swayambho Song, Hombale Films

భక్తి సాగరంలో ముంచెత్తేందుకు హోంబలే ఫిల్మ్స్ రెడీ అవుతుంది. కేజీఎఫ్, కాంతార వంటి భారీ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు మ్యూజిక్ రంగంలోనూ తన ముద్ర వేస్తోంది. శివతత్వాన్ని చాటిచెప్పేలా “శివ శంభో స్వయంభూ” అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను భక్తుల ముందుకు తెస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే, ఈ పాట విజువల్‌గా మ్యూజికల్ గా మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. దైవికమైన సంగీతంతో పాటు శివ భక్తిని చాటే లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Also Read : Subbaraju : లేటు వయసులో పెళ్లి.. అసలు రహస్యం చెప్పిన .. సుబ్బరాజు

కాగా ఈ ప్రోమో ద్వారా ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 15న ఉదయం 10 గంటలకు ఈ పాట పూర్తి వీడియోను విడుదల చేయనున్నారు. నారాయణ్ శర్మ స్వరకల్పనలో, సచిన్ బగ్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్, హోంబలే మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివరాత్రి పర్వదినం దగ్గర పడుతుండటంతో ఈ డివోషనల్ వేవ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్త్ర స్టూడియోస్ (The Astra Studios) సహకారంతో ఈ విజువల్ వండర్ ను సిద్ధం చేశారు..

 

Exit mobile version