NTV Telugu Site icon

Hombale Films: హోంబలే ఫిల్మ్స్ రూటు మార్చిందే!

Hombale Films

Hombale Films

కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలిచ్చిన కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈసారి కొత్త జోనర్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. మరోసారి డివోషనల్ టచ్ ఇస్తుంది. ఆ మూవీకి సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది. తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా ఐడెంటిటీ క్రియేట్ చేసింది హోంబలే ఫిల్మ్స్. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో మంచి రెప్యుటేషన్ ఏర్పడింది. కన్నడ ఇండస్ట్రీలో రిస్క్ చేసి భారీ బడ్జెట్ చిత్రాలను అందించింది. కేజీఎఫ్ ఫ్రాంచేజీ మూవీస్, కాంతార, సలార్ లాంటి పాన్ ఇండియన్ చిత్రాలతో మరింత పాపులారిటీని తెచ్చుకుంది.

Thug Life: థగ్ లైఫ్ కోసం ఇంత పెట్టడానికి రెడీ అయ్యారా?

యష్, డార్లింగ్ ప్రభాస్‌తో కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు పెద్ద పీట వేస్తున్న హోంబలే.. కొత్త జోనర్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్ టైం యానిమేషన్ మూవీని దింపుతోంది. మహావతార నరసింహ అనే మైథాలజీ సినిమాను తీసుకు వస్తుంది. క్లీమ్ ప్రొడక్షన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహ స్వామి కథను యానిమేటెడ్ రూపంలో తీసుకు వస్తుంది హోంబలే. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. 3D వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యానిమేటెడ్ మైథాలజీ మూవీతో హోంబలే హిట్టు అందుకుంటుందో లేదో చూడాలి