NTV Telugu Site icon

Al Pacino: ముసలోడే కానీ మామూలోడు కాదు.. 83ఏళ్ల వయసులో నాల్గొసారి తండ్రి అయ్యాడు

Hollywood Actor Al Pacino

Hollywood Actor Al Pacino

Al Pacino: ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి అయ్యారు. అతని 29 ఏళ్ల స్నేహితురాలు నూర్ అల్ఫాల్లా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. వీరి పేరు రోమన్ పాసినో. పసినోకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన కొడుకు అతనికి నాలుగో సంతానం. దీనికి ముందు అల్ పాసినో బెవర్లీ డి’ఏంజెల్(22)తో సంబంధం కలిగి ఉన్నాడు. వారికి కవల పిల్లలు కలిగారు. వారి పేర్లు వరుసగా అంటోన్, ఒలివియా. అతనికి తన మాజీ ప్రియురాలు జేన్ టారెంట్‌తో జూలీ మేరీ అనే కుమార్తె ఉంది. ఇప్పుడు నాలుగోసారి అల్ పసినో నూర్ కొడుకు తండ్రి అయ్యాడు.

2014 సంవత్సరంలో ది న్యూయార్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పాసినో పితృత్వం గురించి మాట్లాడాడు. తన పిల్లలకు మంచి తండ్రిగా ఎలా ఉండాలనుకుంటున్నాడో చెప్పాడు. పసినో చిన్నతనంలో అతని తండ్రి అతనిని, అతని తల్లిని విడిచిపెట్టాడు. అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా సంబంధం గురించిన వార్తలు 2022 సంవత్సరంలో వినిపించాయి. వారిద్దరూ కరోనా మహమ్మారి సమయంలో ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించారు. అల్ఫాల్లా యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్. నూర్ 22 ఏళ్ల వయసులో 74 ఏళ్ల ప్రముఖ గాయకుడు మిక్ జాగర్‌తో డేటింగ్ చేసింది. అంతకుముందు ఆమెకు 60 ఏళ్ల బిలియనీర్ నికోలస్ బెర్గ్రెన్‌తో కూడా సంబంధం ఉంది. ఆల్ పాసినో క్లాసిక్ ది గాడ్‌ఫాదర్ సిరీస్, స్కార్‌ఫేస్, హీట్, సెర్పికో, సీ ఆఫ్ లవ్, ది డెవిల్స్ అడ్వకేట్ వంటి చిత్రాలలో నటించారు. అతను వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరిష్మాన్, హౌస్ ఆఫ్ గూచీ, ది పైరేట్స్ ఆఫ్ సోమాలియా వంటి చిత్రాలలో కొంతకాలం క్రితం కనిపించాడు.