Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున మరియు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Also Read : Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
Also Read
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇమేజ్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. నాగార్జున సినిమాల్లో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు స్టైలిష్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ఈ స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్టోరీ లైన్ నాగార్జునకు కూడా నచ్చడంతో, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయమని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ చేసి కళ్యాణ్ కృష్ణ సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం లైన్ మాత్రమే చెప్పాడట కళ్యాణ్ కృష్ణ. పాయింట్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అటు నాగ చైతన్యకు కూడా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సూపర్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు కింగ్ నాగార్జున కు హ్యాట్రిక్ విజయాన్ని ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడట. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి హ్యాట్రిక్ కాంబో ఎలాంటి స్టోరీతో వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!