Site icon NTV Telugu

Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు

Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున మరియు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Also Read : Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో

 ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇమేజ్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. నాగార్జున సినిమాల్లో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు స్టైలిష్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ఈ స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్టోరీ లైన్ నాగార్జునకు కూడా నచ్చడంతో, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయమని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ చేసి కళ్యాణ్ కృష్ణ సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం లైన్ మాత్రమే చెప్పాడట కళ్యాణ్ కృష్ణ. పాయింట్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అటు నాగ చైతన్యకు కూడా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సూపర్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు కింగ్ నాగార్జున కు హ్యాట్రిక్ విజయాన్ని  ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడట. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి హ్యాట్రిక్ కాంబో ఎలాంటి స్టోరీతో వస్తారో చూడాలి.

Exit mobile version