NTV Telugu Site icon

HIT and RUN: కారు ఢీకొని అమాంతం గాల్లోకి ఎగిరిన రిటైర్డ్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Car Accident

Car Accident

ఢిల్లీలోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడా లోని సెక్టార్ 53 వీధుల్లో పాలు కొనడానికి బయటకు వెళ్లిన ఓ 64 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని తెల్లటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ‘జనక్ దేవ్’ అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో.. వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న తెల్లటి కారు అవతలి వైపు నుండి వేగంగా వచ్చి, అతనిని ఢీ కొట్టింది. దాంతో అతను కొన్ని అడుగులు గాలిలోకి ఎగిసి పడ్డాడు. జనక్ దేవ్ షాను ఆడి కారు ఢీకొట్టిందని బాధిత కుటుంబం పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..

సెక్టార్ 53లోని గిజోర్ విలేజ్ నివాసి జనక్ దేవ్ షా, ఆకాశవాణిలో రిటైర్డ్ ఉద్యోగి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు సందీప్‌ మాట్లాడుతూ.. తన తండ్రి రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లి కుటుంబానికి పాలు తెచ్చే పనిలో ఉండేవాడని పేర్కొన్నాడు. కాంచన్‌జంగా మార్కెట్ సమీపంలో జరిగిన ప్రమాదం గురించి మాకు ఇరుగుపొరుగు వారు సమాచారం అందించారు. మేము సంఘటనా స్థలానికి చేరుకుని, తరువాత ఆసుపత్రికి తరలించాము. ఆ సమయానికి మా నాన్న ఇక లేరని తెలుసుకున్నాము. సీసీటీవీ ఫుటేజ్ వాహనం ఆడి కారు అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే, పోలీసులు ఇంకా ఆ కార్ సంబంధిత విషయాలు గుర్తించలేదని అన్నారు.

Flight: విమానంలో నగ్నంగా పరుగులు.. ప్యాసింజర్స్ షాక్

ఈ ఘటనపై మేము ఇప్పటివరకు వాహనాన్ని గుర్తించలేకపోయాము. సాయంత్రం వరకు మేము స్కాన్ చేసిన ఏ సిసిటివి కెమెరా ఫుటేజీలో కారు రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించలేదు. అనేక బృందాలను మోహరించారు. కచ్చితంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని ఒక అధికారి చెప్పారు.

Show comments