NTV Telugu Site icon

Karnataka Shakti Scheme: కర్నాటకలో ఉచిత బస్సు టిక్కెట్టు కోసం బురఖా వేసుకున్న వ్యక్తి.. ఎలా పట్టుకున్నారంటే?

Hindu Man

Hindu Man

Karnataka Shakti Scheme: బస్ ఛార్జీని ఆదా చేసేందుకు ఓ హిందూ వ్యక్తి బురఖా ధరించిన వింత ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి బురఖా ధరించి బ్యాగ్‌ని కూడా పట్టుకుని వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కర్నాటక ప్రభుత్వం శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందినది. అక్కడ బస్టాప్‌లో ఒక హిందూ వ్యక్తి బురఖా ధరించి కనిపించాడు. ఆ వ్యక్తి పేరు వీరభద్రయ్య మఠపతి. ప్రజలకు అనుమానం రావడంతో ఆయన వద్దకు వెళ్లి విచారించారు. ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకోవడం ప్రారంభించి, ‘నేను అడుక్కునేందుకే ఈ బురఖా వేసుకున్నాను…’ అయితే, అతని సమాధానం వారిని సంతృప్తి పరచలేదు. అంతే కాదు ఆ వ్యక్తి నుంచి ఓ మహిళ ఆధార్ కార్డు ఫొటో కాపీ కూడా లభ్యమైంది.

Read Also:Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?

శక్తి యోజన అంటే ఏమిటి?
శక్తి పథకం కింద, కర్ణాటకలోని మహిళలు రాష్ట్రంలో నడిచే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే అమలు చేసిన మొదటి ఐదు ఎన్నికల హామీలలో ఇది ఒకటి. రోజుకు 41.8 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ ఉచిత ప్రయాణ సేవ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.4,051.56 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. శక్తి పథకం కర్నాటక రాష్ట్రంలో నడిచే సాధారణ బస్సు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, అంబారి, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఫ్లై బస్, వాయు వజ్ర, వజ్ర, నాన్-ఏసీ స్లీపర్, రాజహంస, ఈవీ పవర్ ప్లస్ ఏసీ బస్సులను ఈ పథకం కింద మినహాయించిన సంగతి తెలిసిందే.

Read Also:Dark Chocolate: డార్క్ చాక్లేట్ రోజూ తీసుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా?

Show comments