Pakistan: సోషల్ మీడియాలో ఇటీవలి పాకిస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో పాకిస్థాన్‌కు చెందిన నటి హినా అఫ్రీదిది కావడంతో మరింతగా వేగంగా చర్చిస్తున్నారు. హినా అఫ్రీది ఇటీవల సోషల్ మీడియా పర్సనాలిటీ తైమూర్ అక్బర్‌ను వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఫోటోలు ఇప్పటికే నెట్టింట పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. అయితే ఆ అందమైన క్షణాల మధ్య ఒక చిన్న వీడియో మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది.
READ MORE: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం
వైరల్ అవుతున్న ఆ క్లిప్‌లో హినా అఫ్రీది చాలా సరదాగా, నవ్వుతూ తన భర్త ముందు ఒక మాట చెప్పింది. ప్రతి నెలా తనకు ఐదు లక్షల రూపాయలు కావాలి, అలాగే ట్రావెల్, షాపింగ్ అన్నీ చూసుకోవాలని అని చెప్పింది. దీనికి తైమూర్ అక్బర్ నవ్వుతూనే సరే అన్నట్లుగా స్పందిస్తారు. ఆ వీడియో చూస్తే ఇది పూర్తిగా జోక్‌లా, సరదా సంభాషణలా కనిపిస్తుంది. కానీ ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం మాత్రం ఇది పెళ్లి సమయంలో జరిగే సాధారణ సరదా మాటలేనని అంటోంది. నికాహ్ లేదా పెళ్లి వేడుకల్లో ఇలాంటి నవ్వులు, చిలిపి మాటలు ఉండటం సహజమేనని అభిప్రాయపడుతున్నారు. హినా, తైమూర్ ఇద్దరూ నవ్వుతున్న తీరు చూస్తే ఇది సీరియస్‌గా చెప్పిన మాట కాదని, కేవలం సరదాగా అన్న మాట అని స్పష్టంగా తెలుస్తోందని వారు చెబుతున్నారు.
READ MORE: Saina Nehwal Retirement: ఒక యుగం ముగిసింది.. బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ గుడ్‌బై!
అయితే మరో వర్గం మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెళ్లి లాంటి బంధంలో డబ్బుల గురించి మాట్లాడటం సరైంది కాదని భావిస్తోంది. ఇలాంటి మాటలు భవిష్యత్తులో సంబంధాలను డబ్బుతో కొలిచే ఆలోచనకు దారి తీయవచ్చని అంటున్నారు. కొందరు యూజర్లు “పెళ్లి ప్రేమ, నమ్మకంతో నడవాలి, డబ్బు షరతులతో కాదు” అని కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంకొక కోణం కూడా బయటకు వచ్చింది. చాలా మంది మహిళా యూజర్లు హినా చెప్పిన మాటలను మహిళా సాధికారతతో కలిపి చూస్తున్నారు. భార్యకు ఆర్థిక భద్రత ఇవ్వడం భర్త బాధ్యతేనని, దాని గురించి ఓపెన్‌గా మాట్లాడటంలో తప్పేమీ లేదని వారు అంటున్నారు. మొత్తానికి ఒక చిన్న సరదా వీడియో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
