హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది..అతి వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో నలుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలతో బయట పడ్డారు.. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం..
వివరాల్లోకి వెళితే..హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో షాలున్ కైచీ సమీపానికి చేరుకోగానే ఓ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు స్థానికులు కూడా అక్కడికి వచ్చారు. ఇక స్థానికుల సాయంతో కారులో ఇరుక్కొని ప్రాణాలతో ఉన్న బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు..ఈ ప్రమాదం లో గాయపడిని బాలిక పరిస్థితిని అబ్జెర్వేషన్ లో ఉన్నట్లు సమాచారం.. ఒకేసారి కుటుంబంలో నలుగురు పోవడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.. బాలికను చూసి కంటతడి పెడుతున్నారు
గత కొద్ది రోజులుగా అక్కడ భారీగా వర్షం పడుతుండటం తో భారీగా నీరు కొండలపై ఉండటంతో వాహనాదారులు నిదానంగా వెళ్లాలని చెబుతున్నారు.. అయిన వినకుండా కొందరు వాహనదారులు వెళ్లడం తో జారీ లోయలో పడిపోతున్నారని పోలీసులు చెబుతున్నాయి.. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా అదే కారణంతో జరిగిందని పోలీసులు వెల్లడించారు.. ఇది ఇలా ఉండగా.. ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ లో ఈ నెల 22వ తేదీన చోటు చేసుకుంది. పితోర్‌ఘర్ జిల్లాలో గత గురువారం ఉదయం ఓ కారు అదుపుతప్పి 600 మీటర్ల లోయ లో పడటంతో తొమ్మిది మంది మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మున్సియారీ ప్రాంతంలోని హోకారా గ్రామం లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..