హుజురాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. టిఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గీయులగా గొడవలు చోటు చేసుకున్నాయి. కమలాపూర్ మండలం గోపాలపూర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు ఈటల అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోపాల్ పూర్ గ్రామంలో కరెంట్ పోల్స్ కు కట్టిన బిజెపి జెండాలను తొలిగించి… టిఆర్‌ఎస్ జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
read also : నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు… ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాదయాత్ర సమాచారంతో కమలాపూర్ మండలంలో పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్ ఫ్లెక్సీలు పెట్టారని బిజెపి నేతల ఆరోపణలు చేస్తున్నారు. పాదయాత్రకు అడ్డకునే ప్రయత్నంలో టీఆర్‌ఎస్ ఈ దౌర్జన్యానికి దిగుతున్నట్లు వారు మండిపడుతున్నారు.
