NTV Telugu Site icon

Manchu Manoj: మోహన్‌బాబు వర్సిటీకి మంచు మనోజ్‌.. MBU దగ్గర టెన్షన్‌, టెన్షన్‌..!

Bmu

Bmu

Manchu Manoj: మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం ఇప్పుడిప్పుడే చల్లబడినట్టు కనిపిస్తోంది.. ఈ మధ్యే గతం గతహా.. నిన్న జరిగింది మార్చిపోవాలి, ఈ రోజు ఏం చేయాలో అది చేయాలంటూ మంచు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్‌ మొదలైంది.. నేడు మంచు మనోజ్ తిరుపతి పర్యటనకు వచ్చేస్తున్నారు.. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మనోజ్‌.. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు స్వాగతం పలికారు.. ఈ పర్యటనలో మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్‌ రానున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.. దీంతో.. మనోజ్ పర్యటన ఆసక్తికరంగా మారింది.. అయితే, మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటు ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు వున్నట్లు సమాచారం.. మరోవైపు.. యూనివర్సిటీలోనే భోగి, సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంచు విష్ణు.. నిన్నే బయల్దేరి వెళ్లిపోయారట.. ప్రస్తుతం క్యాంపస్‌లోనే ఉన్నారు మోహన్‌బాబు.. ఇప్పటికే పోలీసులకు కోర్టు ఉత్తర్వుల గురించి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. కానీ, మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గరకు మనోజ్‌ వస్తారనే సమాచారం.. ఇప్పుడు అందరినీ టెన్షన్‌ పెడుతోంది..

Read Also: Road Accident: శ్రీశైలం శిఖరం సమీపంలో ప్రమాదం.. ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పిన కారు

మరోవైపు తన పర్యటనపై మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు మంచు మనోజ్‌.. ఇప్పటికే రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న మనోజ్‌.. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్లనున్నారు.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా.. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్‌కి బయల్దేరి.. 12:30కి MBUకి చేరుకోనున్నారు.. అక్కడి నుంచి 12:50కి నారావారిపల్లెను సందర్శించనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1:30 గంటలకు జల్లికట్టు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30కి MBU క్యాంపస్‌కి తిరిగి వెళ్లడం. 3:30 నుంచి 4:30 గంటల వరకు వార్షిక సంప్రదాయంలో భాగంగా అనాథ శరణాలయాలను సందర్శించనున్నట్టు మంచు మనోజ్‌ తన షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకున్నారు.. ఈ పర్యటన అంతా బాగానే ఉన్నా.. మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఏం జరగబోతోంది..? ఇప్పటికే మంచు ఫ్యామిలీలో విభేదాలు బహిర్గతం కాగా.. ఈరోజు అంతా కూల్‌గానే ఉంటుంది.. ఇంకా ఏదైనా కొత్త టర్న్‌ తీసుకుంటుందా? అనేది ఉత్కంఠగా మారిపోయింది..

Show comments