Site icon NTV Telugu

Summer: మండుతున్న ఎండలు.. గ్రేటర్‌లో నగరవాసుల ఉక్కిరిబిక్కిరి

High Temparecher

High Temparecher

Summer: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరుకుంది. మరో నాలుగు రోజుల పాటు తీవ్ర వేడి వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 16 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించారు.

నగరవాసుల ఉక్కిరిబిక్కిరి

గ్రేటర్ హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా దేశంలోని గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం జూబ్లీహిల్స్‌లో 38.4, సరూర్‌నగర్‌, చందానగర్‌లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3, సెరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలలంటేనే నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
The Nun 2 : ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ హారర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Exit mobile version