Sugar Level Symptoms: నేటి కాలంలో డయాబెటిస్ (మధుమేహం) కేసులు వేగంగా పెరుగుతున్నాయి, దీని ప్రభావం అన్ని వయసుల వారిపై పడుతోంది. ఈ పరిస్థితి శరీరంలోని శక్తి సమతుల్యతను (Energy Balance) నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయనప్పుడు లేదా తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీని ఫలితంగా అధిక చక్కెర స్థాయి (High Sugar Level) సమస్య అంటే డయాబెటిస్ వస్తుంది. సాధారణంగా ఉపవాసం (Fasting) ఉన్నప్పుడు చక్కెర స్థాయి 70−100 mg/dL మధ్య ఉంటుంది. అయితే, 100−125 mg/dL మధ్య ఉంటే ప్రీ-డయాబెటిక్ పరిస్థితిని సూచిస్తుంది. అదే మరియు 126 mg/dL కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్లుగా పరిగణించవచ్చు.
Kishan Reddy: భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి రేవంత్ ప్రభుత్వానిది..
చక్కెర స్థాయిలు పెరగడానికి అతి ముఖ్యమైన కారణం ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం. దీంతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా చక్కెర స్థాయిలు పెరిగేందుకు దోహదపడతాయి. ఆ కారణాలలో ముఖ్యంగా.. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం (Obesity), మానసిక ఒత్తిడి (Stress), నిద్ర లేమి (Lack of Sleep), హార్మోన్ల మార్పులు (Hormonal Changes), జన్యుపరమైన కారణాలు (Genetic Factors) షుగర్ లెవెల్స్ మారడానికి దోహదం చేస్తాయి. చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు అధికంగా ఉన్నప్పుడు అది గుండె, కిడ్నీలు, కళ్లు, నరాలు, చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపు తగ్గడం, నరాలలో మొద్దుబారడం, పాదాలపై గాయాలు మానకపోవడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. అందుకే అధిక చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించడం చాలా ముఖ్యం.
Health Benefits of Guava: జామపండ్లతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలిస్తే .. అస్సలు వదిలిపెట్టరు.
నిపుణల ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అందులో తరచుగా దాహం అనిపించడం, పదేపదే మూత్రం పోయాలనిపించడం, విపరీతంగా ఆకలి వేయడం, అలసట, మసకబారిన దృష్టి, బరువు తగ్గడం లేదా పెరగడం, చర్మం పొడిబారడం, గాయాలు నెమ్మదిగా మానడం, పాదాలు లేదా చేతులలో తిమ్మిరి లేదా మొద్దుబారడం వంటివి జరుగుతాయి. అప్పుడప్పుడు చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గందరగోళం, వేగవంతమైన గుండె కొట్టుకోవడం, వాంతులు, స్పృహ కోల్పోవడం, డీహైడ్రేషన్ అండ్ కీటోయాసిడోసిస్ ప్రమాదం వంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం, చర్మంపై దురద కూడా పెరిగిన చక్కెర స్థాయికి సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
