NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్ కి పోలీసుల హై సెక్యూరిటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Kalki

Kalki

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు .ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ బుజ్జి గురించి మేకర్స్ ఇటీవల రివీల్ చేసారు.ఈ సినిమాలో బుజ్జి అనేది ఓ రోబోటిక్ కార్.. ఈ బుజ్జి కల్కి లోని భైరవకు ప్రాణ మిత్రుడు..ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.

Read Also :Kalki 2898 AD : బుజ్జి తో భైరవ మాస్ ఎంట్రీ అదిరిపోయిందిగా…

ఇదిలా ఉంటే నేడు బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మేకర్స్ నేడు (మే 22) న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఈవెంట్ లో ప్రేక్షకులు ,ప్రభాస్ అభిమానులు భారీగా పాల్గొన్నారు.బుజ్జి ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులు ప్రభాస్ ప్రభాస్ అంటూ స్లోగన్స్ చేయడం మొదలుపెట్టారు.ప్రేక్షకుల అరుపులు ,కేకలు ,చప్పట్ల మధ్య ప్రభాస్ బుజ్జితో మాస్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రభాస్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన అనంతరం బుజ్జిని ఓ స్పెషల్ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసాడు.అనంతరం ప్రభాస్ మాస్ స్పీచ్ తో అదరగొట్టారు.అయితే అక్కడికి భారీగా అభిమానులు చేరుకోవడంతో ప్రభాస్ కు పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.భారీ రోప్ తో కొంత మంది ప్రభాస్ చుట్టూ సెక్యూరిటీ గా నిలబడ్డారు..ప్రస్తుతం ఆ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి .

Show comments