Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూల్‌పై ట్రాఫిక్ పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. నిత్య కృత్యంగా చేపట్టే.. పెండింగ్ చలాన్ల వసూల్‌పై ట్రాఫిక్ పోలీసుల డ్రైవ్ ఇంకా మొదలవ్వలేదు. ఉదయం 9 గంటలకే టాబ్స్‌తో ప్రధాన మార్గాల్లో వాహనదారుల పెండింగ్ చలాన్లు చెక్ చేసేవాళ్లు. నిన్న పెండింగ్ చలాన్ వసూళ్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు ట్రాఫిక్ సిబ్బంది.. ఉన్నతాధికారుల ఆదేశాల కొరకు వేచి చూస్తున్నారు.
READ MORE: టీవీ వ్యాపారంలో కొత్త అడుగు.. SONYతో చేతులు కలిపిన TCL.!
ఇదిలా ఉండగా.. పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ నిన్న(మంగళవారం) రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను (keys) లాక్కోవడం లేదా వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమేనని, చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది.
READ MORE: 6.9mm స్లీక్ డిజైన్, AMOLED డిస్ప్లే, Exynos 1680 చిప్ తో రాబోతున్న Samsung Galaxy A57..!
