Site icon NTV Telugu

Chandrababu Case: హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..

Chandrababu

Chandrababu

Chandrababu Case: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరాశ ఎదురైంది.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేయడంతో హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. అయితే, దీనిపై విచారణకు హైకోర్టు నిరాకరించింది. కాగా, ఏపీ స్కిల్‌ స్కాం కేసులో ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు సోమవారం డిస్మస్‌ చేసింది.. దాంతో.. హైకోర్టుకు వెళ్లారు చంద్రబాబు.. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు.. కానీ, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణకు న్యాయమూర్తి నిరాకరించారు.. ఇంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో.. మళ్లీ రెగ్యులర్‌ పిటిషన్‌ను చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రెగ్యులర్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. రేపు విచారణకు లిస్ట్‌ అవుతుందా? మరికొంత సమయం పడుతుందా? అనేది వేచిచూడాల్సి ఉంది. కాగా, ఏపీ స్కిల్‌ స్కాం కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్‌ చేసింది సీఐడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు.

Exit mobile version