NTV Telugu Site icon

Secret Cameras: ఓయో గదుల్లో సీక్రెట్‌ కెమెరాలు.. రొమాంటిక్ వీడియోలు తీసి..!

Secret Cameras

Secret Cameras

Secret Cameras: ఓయో రూమ్‌లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి జంటల రొమాంటిక్‌ వీడియోలు తీస్తోంది ఓ ముఠా. అనంతరం వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది. దంపతులను సన్నిహిత దృశ్యాలను చిత్రీకరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఆ ముఠా ఆట కట్టించారు నోయిడా పోలీసులు. ఓ బాధిత జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించి దాడి చేయడంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని పలు ఓయో హోటల్స్‌ను ఈ ముఠా టార్గెట్​ చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఆ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకున్న ముఠా.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెమెరాలు అమర్చింది. అమర్చిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈసీక్రెట్‌ కెమెరాల బాగోతంలో ఓయో స్టాఫ్‌ పాత్ర ఏమిలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

కొన్ని రోజులకు.. ఓ ఓయో హోటల్‌లో దంపతులు రూమ్​ తీసుకున్నారు. వారు తీసుకున్న రూమ్‌లో కెమెరాలు ఉన్నట్టు వారికి తెలియదు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన మరికొన్ని రోజులకు.. నేరస్థుల బృందం మళ్లీ ఆ ఓయో రూమ్‌​కి వెళ్లింది. సీక్రెట్​ కెమెరాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఓ కెమెరాలో.. దంపతులు సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వారిని ట్రాక్​ చేసింది ఆ బృందం. డబ్బులు ఇవ్వకపోతే, వీడియోలను వైరల్​ చేస్తామని బెదిరించింది.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఇందులో హోటల్​ సిబ్బంది పాత్ర లేదని స్పష్టమైంది. ఆ తర్వాత పలు షాకింగ్​ విషయాలు బయటపడ్డాయి.

Law Students: టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత.. సిబ్బందిపై లా స్టూడెంట్స్ దాడి

విష్ణుసింగ్‌, అబ్దుల్‌ వాహవ్‌, పంకజ్‌ కుమార్‌, అనురాగ్‌ కుమార్‌ సింగ్‌ అనే నలుగురు నిందితులు నోయిడాలోని మూడు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్‌ బుక్‌చేసి కమిషన్‌ తీసుకుంటారని, ఈ క్రమంలోనే రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పారు. తర్వాత నిందితులు ఆ వీడియోలను సంబంధిత జంటలకు పంపి డబ్బు డిమాండ్ చేస్తారని, డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ నలుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 11 లాప్‌టాప్‌లు, 21 మొబైల్‌ ఫోన్‌లు, 22 ఏటీఎం కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాంగుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు. ఈ గ్యాంగ్​కు సంబంధించిన మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఈ వ్యవహారంపై ఓయో సంస్థ ఇంకా స్పందించలేదు.