NTV Telugu Site icon

Hi Nanna : ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న హాయ్ నాన్న..

Whatsapp Image 2024 01 07 At 3.07.19 Pm

Whatsapp Image 2024 01 07 At 3.07.19 Pm

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సుమారు రూ.75కోట్ల కలెక్షన్లతో కమర్షియల్‍ సక్సెస్ సాధించింది.లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో హాయ్ నాన్న మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇటీవలే ఈ చిత్రంలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 4వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

ఈ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా దూసుకెళుతోంది.నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రస్తుతం (జనవరి 7) హాయ్ నాన్న తెలుగు వెర్షన్ ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. నేషనల్ వైడ్‍ గా ఈ మూవీ టాప్ ప్లేస్‍కు చేరింది. టాప్-10లో హాయ్ నాన్న హిందీ వెర్షన్ 5వ ప్లేస్‍లో ఉండగా తమిళ వెర్షన్ 10వ ప్లేస్‍లో ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఇండియా టాప్-10లో మూడు ప్లేస్‍ల్లో హాయ్ నాన్న ట్రెండ్ అవుతుంది.ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్‌టైన్‍మెంట్ నేడు ట్వీట్ చేసింది.హాయ్ నాన్న సినిమాలో నాని మరియు మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్‌ తో అందరినీ ఆకట్టుకున్నారు.. నాని కూతురిగా నటించిన బేబి కియారా ఖన్నా కూడా ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో జయరాం, ప్రియదర్శి, నాజర్, విరాజ్ అశ్విన్ మరియు అంగద్ బేడీ ముఖ్యపాత్రలు పోషించారు.అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ఓడియమ్మ సాంగ్‍లో క్యామియో రోల్ చేసి తన డాన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది