NTV Telugu Site icon

Hi Nanna : హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2023 11 21 At 1.05.36 Pm

Whatsapp Image 2023 11 21 At 1.05.36 Pm

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్నా’. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు.తండ్రి కూతురు అనుబంధం తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే నాని కూతురి పాత్రలో బేబీ కియారా నటించింది..ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు.. విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు మేకర్స్.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నాని రాజకీయ నాయకుడిగా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రాజకీయ నాయకుడిగా నాని అనుకరిస్తూ చేసిన వీడియోలకు మంచి స్పందన లభిస్తోంది.

‘హాయ్ నాన్న’ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయాల్లో హీరో నాని కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది.. దీని వెనుక ఆయన రెమ్యూనరేషన్ ప్రధాన కారణమని సమాచారం.. ఈ సినిమాకు ఆయన 25 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమాతో పాటు మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో భారీ పోటీ నెలకొనడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదని సమాచారం.దాంతో హీరో నాని రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నవంబర్ 24న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అనౌన్స్ చేసింది. రెండున్నర గంటల సినిమా నుంచి రెండున్నర నిమిషాలు ప్రేక్షకులకు చూపించబోతున్నామని నాని ట్వీట్ చేశారు.దీనితో ఈ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు అని అర్థం అవుతోంది.

https://twitter.com/NameisNani/status/1726850601034887527?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726850601034887527%7Ctwgr%5Eab3495b6f38eaeef4c040a0264cb0913be60d004%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Show comments