సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వాలి అంటే ఆ సినిమాకు కచ్చితంగా ప్రమోషన్స్ చేసి తీరాలి. ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావు. అందుకే ప్రతి నిర్మాత సినిమాను ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా భారీగా ప్రమోషన్స్ చేస్తూ వుంటారు.. రొటీన్ సినిమాలు చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టింది.కథ మరియు కథనంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే నాచురల్ స్టార్ నాని కూడా ప్రేక్షకులని అలరించడానికి కొత్త కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తున్నాడు.మొదటి నుంచి కూడా నాని సినిమాలు కొత్తగా ఉండేవి. ఆయన ఎప్పుడూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తుంటారు.ఈ మధ్య నాని వరుస ప్లాప్ లను ఎదుర్కున్నాడు.
రీసెంట్ గా చేసిన దసరా సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నాని. దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా బాగా ఆకట్టుకుంది.. దసరా సినిమా మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నాని, కీర్తి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తరువాత నాని తన 30వ సినిమాను స్టార్ట్ చేసాడు ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తున్నారు.మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా టైటిల్ మరియు గ్లింప్స్ ను విడుదల చేసారు.ఈ గ్లింప్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది… ”హాయ్ నాన్న” అనే టైటిల్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ గ్లింప్స్ కు సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ గ్లింప్స్ ఇప్పటికే 3 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించింది.ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.
