Heroine Ester: అతడు నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine Ester: సినిమాలు చేసే సమయంలో లవ్ లో పడి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొంత కాలానికే చాలా జంటలు విడిపోతున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది మాత్రమే తమ మధ్య ఏర్పడిన మనస్పర్థలకు కారణాలు వాటికి పరిష్కారం కనుగొని కలిసుంటున్నారు. ఎందుకు రాజీ పడాలి అనుకునే వారు అహం అసూయలతో రగిలిపోతూ చివరికి విడిపోతున్నారు. అలా పెళ్ళైన ఆరు నెలలకే విడిపోయిన వారిలో సింగర్ నోయెల్, హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా జంట ఒకటి. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దీంతో ఎవరి దారి వాళ్లు చూసుకుని విడివిడిగా ఉంటున్నారు.
Read Also: Sai Pallavi comments on dance shows : డ్యాన్స్ షోలపై హీరోయిన్ సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్
Also Read
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
సింగర్ నోయెల్ తన సింగింగ్ వృత్తిలో బిజీగా ఉంటే, ఎస్తేర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా 69 సంస్కార్ కాలనీ అనే మూవీలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సమయంలో ఆమె నోయెల్ పై పలు ఆరోపణలు చేసింది. తనతో విడిపోయిన తర్వాత నోయెల్.. తనపై నెగిటివ్ ప్రచారం చేశాడని ఆరోపించింది. విడాకుల తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లిన నోయెల్.. ఆ ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడంటూ కామెంట్ చేసింది. తనను అన్ని రకాలుగా వాడుకుని బ్యాడ్ చేశాడంటూ నోయెల్ పై మండిపడింది. తనను బ్యాడ్ చేయడంతో.. తనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం లాంటి నోయెల్ ని వదిలేసి ఎలా వెళ్లిపోయావ్ అనేలా తన మీద సింపతీ క్రియేట్ చేసుకున్నాడని నోయెల్ పై విమర్శలు చేసింది. దీంతో వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే మూడేళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నానని ఆమె వెల్లడించింది. పెళ్ళైన ఆరు నెలలకే ఇద్దరం విడాకులు తీసుకున్నామని, కానీ తాము కలిసి ఉన్నది కేవలం 16 రోజులు మాత్రమే అని ఆమె వెల్లడించింది.
- Tags
- big boss
- Heroine Ester
- NOEL
తాజావార్తలు
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!