Suriya: ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న హీరో సూర్య నిర్ణయం
- అభిమానులను ఆందోళన పెడుతున్న సూర్య
- రవితేజ ఫ్లాప్ మూవీతోనే వస్తాడా లేదా మారుస్తాడా
- మార్పులు చేయాలంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన నటించిన కంగువా సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఐతే ఆ సినిమా విడుదలకు ముందున్న అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. శివ డైరెక్షన్ లో రూపొందించిన కంగువ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐతే ఆ సినిమా డిజాస్టర్ నుంచి వెంటనే తేరుకున్న సూర్య తన తదుపరి సినిమా మూడ్ లోకి వచ్చేశాడు. సూర్య 44వ సినిమా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల తర్వాత పూజా హెగ్దే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందుకున్న ఆఫర్ ఇదే.
Read Also:Students Suicide: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య..
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఇక ఈ సినిమా తర్వాత సూర్య 45వ సినిమా ఆర్.కె బాలాజి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. వీజేగా అలరించిన బాలాజీ డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. సూర్యతో బాలాజీ చేస్తున్న సినిమా పై అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా తెలుగు సినిమా స్పూర్తితో వస్తుందని తెలుస్తోంది. అది కూడా ఒక ఫ్లాప్ సినిమా కథను అటు ఇటు మార్చి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also:Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా వీర. 2011 లో విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఐతే బాలాజీ సూర్య కాంబో సినిమా కాస్త అటు ఇటుగా ఇలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. మరి రవితేజ సినిమా ఫ్లాప్ అని తెలిసినా సరే మళ్లీ అలాంటి ప్రయత్నం అంటే ఈ సారి ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాచ్చు. సూర్య 45వ సినిమా అభిమానులను దృష్టిలో ఉంచుకుని వారికి ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తుంది చిత్రయూనిట్. కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగులో కూడా ఫాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. సూర్య చేసే ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. గజిని సినిమా నుంచి సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సూర్య సినిమా అంటే అయన తెలుగు ఫ్యాన్స్ అలర్ట్ గా ఉంటారు. ఐతే కొన్నాళ్లు కొత్త ప్రయోగాలు, సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చేసిన సూర్య ఇక మీదట అభిమానులు కోరుకునే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే కార్తీక్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ మాస్ అప్పీల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబో సినిమా నెక్ట్స్ ఇయర్ వేసవిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఐతే బాలాజీ సినిమా కూడా 2025 ఎండింగ్ కి వస్తుందని టాక్.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!