NTV Telugu Site icon

Hero MotoCorp : భారీ లాభాల్లో హీరో మోటో కార్ప్.. ఒక్కో షేరుకు రూ.100డివిడెండ్ ప్రకటన

Hero Motocorp

Hero Motocorp

Hero MotoCorp : ద్విచక్ర వాహన రంగంలో అతిపెద్ద కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 51 శాతం పెరిగి రూ.1073.4 కోట్లకు చేరుకుంది. శుక్రవారం కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.100 డివిడెండ్ కూడా ప్రకటించింది. నిపుణులు కూడా కంపెనీకి మంచి లాభాలను అంచనా వేశారు.

Read Also:Karnataka: వార్నీ.. ఆపరేషన్ థియేటర్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్.. చివరికి..

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తమ ఆదాయం రూ.9723.7 కోట్లుగా ఉందని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 8031కోట్లు. కంపెనీ EBITDA మార్జిన్ కూడా వార్షిక ప్రాతిపదికన 250 బేసిస్ పాయింట్లు పెరిగి 14 శాతానికి చేరుకుంది. పండుగ సీజన్‌లో కంపెనీ విక్రయాలు ఇప్పటివరకు అత్యధికంగా నమోదయ్యాయి. ఆ 32 రోజుల్లో కంపెనీ సుమారు 14 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 100 డివిడెండ్‌ను బోర్డు ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో రూ.75 మధ్యంతర డివిడెండ్, రూ.25 ప్రత్యేక డివిడెండ్. శుక్రవారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు, హీరో మోటో కార్ప్ షేర్లు బిఎస్‌ఇలో 2.10 శాతం పెరిగి రూ.4,908.5 వద్ద ముగిసింది.

Read Also:Hyderabad: పాత ఇళ్లకు ఫుల్‌ డిమాండ్..! కొత్త వాటితో పోటీగా సేల్స్‌..!

టూవీలర్ కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో వ్యాపార, ఆర్థిక వాతావరణాన్ని కల్పించామన్నారు. ఇది మరింత వృద్ధికి దారి తీస్తుంది. ఉపాధి కూడా పెరుగుతుంది. మేము ఇటీవల విడుదల చేసిన మోడళ్లకు మార్కెట్ నుండి మంచి స్పందన వచ్చింది. హీరో మోటో కార్ప్ త్వరలో అనేక ఉన్నత ప్రీమియం మోడళ్లను విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్ సందర్భంగా, కంపెనీ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, మావెరిక్ 440లను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తమ పనితీరు మరింత మెరుగ్గా ఉండగలదని కంపెనీ పూర్తి ఆశతో ఉంది. ఏథర్‌ సహకారంతో దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తున్నామని నిరంజన్‌ గుప్తా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో కంపెనీ 100 నగరాలకు చేరుకుంది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరించనున్నారు.