NTV Telugu Site icon

Hero Vida V2: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ. మైలేజ్.. మార్కెట్లోకి వచ్చేసిన హీరో విడా వీ2

Hero

Hero

Hero Vida V2: హీరో మోటోకార్ప్ నుండి విడా వీ2 బుధవారం (డిసెంబర్ 4) భారతదేశంలో విడుదలైంది. ఇదివరకే విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 కు అప్డేట్ వర్షన్ విడా V2ని విడుదల చేసింది. ఈ మోడల్ లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్‌లలో కంపెనీ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. Vida V2 శ్రేణి ప్రారంభ ధర రూ. 96,000 గా ఉంది. ఇందులో టాప్ వేరియంట్ V2 ప్రో రూ. 1.35 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వాహన వారంటీని అందిస్తోంది. అయితే బ్యాటరీ ప్యాక్‌పై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ ఉంటుంది.

Also Read: Most Outs in 90s: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు 90లలో అవుటైన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?

V2 ప్రో వేరియంట్‌ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 94కి.మీ.ల రేంజ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోని Ather Rizta, Ather 450X, Ola S1 శ్రేణి, బజాజ్ చేతక్ ఇంకా టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీపడుతుంది. ఇక ఇందులో రిమూవబుల్‌ బ్యాటరీ సదుపాయం కలిగిన విడా వీ2 స్కూటర్‌ గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. ఈ బ్యాటరీ సింగల్ ఛార్జింగ్‌తో 165 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ కొత్త స్కూటీలో కస్టమ్‌ రైడింగ్‌, కీలెస్‌ ఎంట్రీ, క్రూయిజ్‌ కంట్రోల్, మోడ్‌ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Bitcoin Price: లక్ష డాలర్స్‌ను దాటేసిన బిట్‌కాయిన్.. అంతా ట్రంప్ వల్లనేనా?