NTV Telugu Site icon

Bhaje Vaayu Vegam First Look: ‘భజే వాయు వేగం’ ఫస్ట్‌ లుక్‌.. బ్యాట్‌తో కార్తికేయ పరుగులు!

Bhaje Vaayu Vegam First Look

Bhaje Vaayu Vegam First Look

Kartikeya’s Bhaje Vaayu Vegam Movie First Look Out: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ చివరిరగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా బాక్సాఫీక్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ ఏదీ ప్రకటించలేదు. రంజాన్ 2024 పర్వదినం సందర్భంగా ఈద్‌ ముబారక్ చెబుతూ.. గురువారం కార్తికేయ తన 8వ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. శుక్రవారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 12.06 నిమిషాలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మేకర్స్‌ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల అయ్యాయి.

కార్తికేయ కొత్త చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంఛ్ చేశారు. ఈ సినిమాకు ‘భజే వాయు వేగం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కార్తికేయ పార్క్ నుండి బ్యాట్‌తో పరుగెత్తుతున్న ఫొటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ‘అతడు తన అదృష్టాన్ని ఛేజ్‌ చేయడానికి పార్క్ నుండి వస్తున్నాడు. మిమ్మల్ని మీ సీట్ల నుంచి లేచి నిలబడేలా చేస్తాడు. రేసీ థ్రిల్లర్ ఇది’ అని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. వవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Sayaji Shinde Health: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజి షిండే!

భజే వాయు వేగం చిత్రంకు నూతన డైరెక్టర్ ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్‌ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీలో మలయాళ భామ ఐశ్వర్య మీనన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. హ్యాపీ డేస్ ఫేం రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి రాధన్‌ సంగీతం అందిస్తుండగా.. కపిల్‌ కుమార్‌ బీజీఎం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Show comments