NTV Telugu Site icon

Ashok Galla: డిజిటల్ క్రియేటర్‌కు యువ హీరో అశోక్ గల్లా ఆర్థిక సహాయం!

Ashok Galla

Ashok Galla

Hero Ashok Galla Help Digital Creator: యువ హీరో అశోక్ గల్లా మానవతా దృక్పథంతో తన వంతు సాయం చేశారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ మీమర్‌కు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షలు విరాళంగా అందించారు. ఏప్రిల్ 5వ తేదీన తన జన్మదినం సందర్భంగా అశోక్ గల్లా తన మంచి మనసు చరుకున్నారు. యువ హీరో చేసిన మంచి పని ఇటీవల తెలుగు డిఎంఎఫ్‌లో చేరిన మీమర్స్ కమ్యూనిటీకి భరోసాను ఇస్తోంది. అశోక్ గల్లా జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు డిఎంఎఫ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన తన సాయాన్ని ప్రకటించారు.

Also Read: Adah Sharma: నేను చూడ్డానికే వెళ్లాను.. అందరికీ తప్పకుండా చెబుతా: ఆదా శర్మ

అశోక్ గల్లా జన్మదినం సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మూడవ చిత్రాన్ని ప్రకటించారు. చిత్ర ప్రకటన తెలుగు డిఎంఎఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మరింత సందడిగా మార్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఉద్భవ్ రఘునందన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. అలాగే ‘హ్యాపీ బర్త్‌డే’ అంటూ అశోక్ గల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’తో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 2022లో అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.

Show comments