Hema Posts Biriyani Cooking Video amid Bengaluru RaveParty Controversy: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు ప్రయత్నం చేసి రోజులు గడుస్తున్నా ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు నటి హేమ ఈ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నదనే విషయాన్ని బెంగళూరు పోలీసులు ఘంటా పధంగా చెబుతున్నారు. నిజానికి ముందు హేమ పేరు ప్రచారం జరిగితే కొద్దిసేపటికి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఇక్కడ చిల్ అవుతున్నాను, నేను ఎలాంటి బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికి బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో ఒకదాని రిలీజ్ చేయడమే కాదు ఆమె వీడియో చేసి రిలీజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ ని కూడా ఒక ఫోటో తీసి ఆమె తమ అదుపులోనే ఉందని ప్రకటించడం కలకలం రేపింది. ఇక ఈరోజు కూడా బెంగళూరు సిపి పెట్టిన ప్రెస్ మీట్ లో హేమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Rakshana: ‘రక్షణ ‘ టీజర్ వచ్చేసింది.. పాయల్ ఇరగదీసింది మామా..!
ఆమె కూడా ఈ పార్టీలో పాల్గొన్నదని ఆయన వెల్లడించారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు ఒక కేసు, అసలు తన పాల్గొనలేదంటూ వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు ఆమె మీద ఫైల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానంటూ ఆమె తయారీ విధానాన్ని చూపించడం గమనార్హం. అయితే హేమ పెట్టిన వీడియోకి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. దొరికేశారు ఇంకా కవర్ చేయొద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే మీరు ఎన్ని కవర్ డ్రైవ్ లు వేసినా పోలీసులు మీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడంలో అర్థం ఏంటి? మీరు ఇంట్లోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.