Site icon NTV Telugu

Helmets For Sikh Soldiers: సిక్కు సైనికులకు హెల్మెట్?.. తీవ్రంగా వ్యతిరేకించిన గురుద్వారా

Helmets

Helmets

Helmets For Sikh Soldiers: శిరోమణి గురుద్వారా పర్బంధక్(SGPC) కమిటీ సిక్కు సైనికులకు బాలిస్టిక్ హెల్మెట్‌లను ప్రవేశపెట్టే చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. సిక్కుల అత్యున్నత మత సంస్థ అయిన ఎస్‌జీపీసీ ప్రతినిధి బృందం ఈ సమస్యపై చర్చించేందుకు జాతీయ మైనారిటీల కమిషన్ చీఫ్‌ను కలిసింది. సిక్కు గుర్తింపు విషయంలో ఎలాంటి జోక్యాన్ని సహించబోమని ఎస్‌జీపీసీ ప్రతినిధి బృందం తెలిపింది. అందువల్ల సిక్కు సైనికులు హెల్మెట్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరాదని వారు తెలిపారు. సిక్కు సైనికుల కోసం బాలిస్టిక్ హెల్మెట్‌లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

PM Kusum Yojana: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కుసుమ్ యోజన పొడిగింపు

న్యూఢిల్లీలోని ఎన్‌సీఎం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఎస్‌జీపీసీ ప్రతినిధి బృందం హాజరయ్యారు. ప్రతినిధి బృందంలో ఎస్‌జీపీసీ ప్రధాన కార్యదర్శి గుర్చరణ్ సింగ్ గ్రేవాల్, సభ్యుడు రఘ్‌బీర్ సింగ్ సహారన్ మజ్రా ఉన్నారు. సిక్కు సైనికులు హెల్మెట్‌లు ధరించాలని ప్రభుత్వం నివేదించిన ప్రతిపాదనపై ఎన్‌సీఎం ఛైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా ముందు ఇది తీవ్ర అభ్యంతరం నమోదు చేసింది. ఈ అంశంపై ఎటువంటి చర్చ లేదా తార్కికం ఉండదని సూచించింది.

Exit mobile version