Site icon NTV Telugu

Heavy rain: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ లిస్టు విడుదల

Rain

Rain

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాబోయే ఐదు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, మణిపూర్, అండమాన్ నికోబార్ ఐస్‌లాండ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక మిజోరాం, త్రిపుర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా, పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లో ఉరుములు, మెరుపులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత..

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల్ని, ప్రజల్ని అలర్ట్ చేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. త్రిసూర్, మలప్పురం, కోజికోడ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇడుక్కి, వాయనాడ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కేరళలోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: PM Modi: 45 గంటల ధ్యానాన్ని ముగించిన ప్రధాని నరేంద్రమోడీ..

Exit mobile version