NTV Telugu Site icon

Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..

Hyderabad Rains

Hyderabad Rains

Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు ఉంటాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత.. వేడిమి వాతావరణం ఉంటుందని తెలిపింది. వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినా ఒక్క చోటే కురవడం మరో చోట వర్షం కురవకపోవడం ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బుదులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read also: SDGM: బాలీవుడ్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా.. జూన్ 22 నుంచి షూటింగ్!

ఇప్పటికే పలువురు రైతులు వరిసాగు చేశారు. కానీ వర్షం కురిస్తేనే మొక్కలు నాటే అవకాశం ఉంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇండో-జర్మన్ నిపుణులు కూడా తెలంగాణ వాతావరణాన్ని పరిశోధించారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో జూన్ 21, 22 తేదీల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. జూన్ 21న తూర్పు తెలంగాణ, 22న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు ప్రకటించారు.

Read also: Big Breaking: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

ఈసారి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇండో-జర్మన్ నిపుణుల బృందం దేశంలో రుతుపవనాల ప్రవేశాన్ని, వాటి వల్ల కురిసే వర్షపాతాన్ని అధ్యయనం చేసింది. దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు చేసి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితులను వివరించారు. మరోవైపు సూపర్ నినో క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2023 జూన్‌లో ప్రారంభమైన ‘ఎల్‌నినో’ ప్రభావం మే 2024 వరకు గత సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఎన్నడూ చూడని వేడిని పరిచయం చేసిందని వివరించింది. ప్రస్తుతం పరిస్థితి తటస్థంగా ఉంది. ఎల్‌నినో వస్తే ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి!