అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు మండలాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తలుపుల మండలం లో 142.2. మిల్లీమీటర్ల నమోదు కావడంతో తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండి పడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తలుపుల మండలం గొల్లపల్లి వద్ద కదిరి నుంచి విజయవాడ కి వెళ్తున్న కారు వరదనీటిలో కొట్టుకుపోవడంతో కారు డ్రైవర్ రఫిక్ తో పాటు మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాష కుమారుడు బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్ మృతి చెందారు.
అనంతపురం జిల్లాలో వర్షం… ఇద్దరు మృతి
