NTV Telugu Site icon

Weather Updates: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..

Maxresdefault (23)

Maxresdefault (23)

Rain Alert For Telugu States: తెలంగాణలో పలు ప్రాంతలకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతు పవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. రాబోయ్ ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఆదిలాబాద్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read; Monday Stotram: జ్యేష్ఠ సోమవారం ఈ స్తోత్రాలు వింటే సకల సౌభాగ్యాలు

ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఇక ఆంధ్రపరదేశ్ విషయానికి వస్తే నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పట్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం అధికారులుకు తగిన జాగరత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది..