Site icon NTV Telugu

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Rains

Rains

నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్, ఎండీ తెలిపారు.

Exit mobile version