Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Heavy Rain India 33 People Died

వణికిస్తున్న భారీ వర్షాలు : 33 మంది మృతి

Published Date :July 22, 2021 , 2:29 pm
By Lakshmi Narayana
వణికిస్తున్న భారీ వర్షాలు : 33 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ నుంచి ముంబై దాకా.. నార్త్‌ ఇండియాలో నాన్‌ స్టాప్‌ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపిలేని వానలకు.. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఆ ప్రవాహాల్లోనే కష్టంగా ప్రయాణాలు చేస్తున్నారు రాజధానివాసులు. ఆర్థిక రాజధాని ముంబైనీ వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబయి, థానె, పాల్ఘర్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని గంటలుగా ముంబయిలోని చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వానల కారణంగా జరిగిన పలు సంఘటనల్లో.. ఇప్పటివరకూ 33 మంది చనిపోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు.

ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆదివారం నుంచి కురుస్తోన్న వానలతో ముంబై నగరం తడిసి ముద్దవుతోంది. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు సూచించింది బీఎంసీ. ముంబయి, థానె, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేసింది. ఇవాళ కూడా వానలు తెరిపినిచ్చే సూచనలు కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలిపింది.

ఒక్క మహారాష్ట్రలోనేకాదు, నార్త్‌ స్టేట్స్‌లో చాలా వరకు వానలు దంచి కొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలకు గోడకూలి..ఏడుగురు చనిపోయారు. భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బతినడంతో ఈ ప్రమాదాలు జరిగట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, తనక్‌పూర్‌ రోడ్డుపై.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో.. ప్రాణనష్టం తప్పింది.

ఉత్తర భారతానికి వాన ముప్పు ఇంకా పోలేదని… వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మోస్తరుగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Hardik Pandya Stats: బిగ్ మ్యాచ్‌లలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. ఐసీసీ నాకౌట్‌లలో ఆహా అనిపిస్తున్న హార్దిక్ గణాంకాలు!

  • Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్‌ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!

  • Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!

  • Surendhar Reddy : పవన్ కళ్యాణ్ సినిమాతో సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇస్తారా?

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

ట్రెండింగ్‌

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions