NTV Telugu Site icon

Heath Streak Alive: థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడు.. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ చనిపోలేదు!

Heath Streak Alive

Heath Streak Alive

Former Zimbabwe Cricketer Henry Olonga Says Henry Olonga confirms is Alive: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూశారని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్‌ స్ట్రీక్‌ మంగళవారం తుది శ్వాస విడిచారని జింబాబ్వే మాజీ ప్లేయర్ హెన్రీ ఒలొంగ ఎక్స్‌ (ట్వీటర్) వేదికగా వెల్లడించారు. స్ట్రీక్ మరణం గురించి ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత హెన్రీ ఒలొంగ మరో ట్వీట్ చేశారు. థర్డ్ అంపైర్ హీత్‌ స్ట్రీక్‌ని వెనక్కి పిలిచాడని, అతను సజీవంగా ఉన్నాడని పేర్కొన్నారు.

‘హీత్ స్ట్రీక్ మరణానికి సంబంధించిన పుకార్లు ఎంతో అతిశయోక్తిగా ఉన్నాయి. నేను అతనితో ఇప్పుడే మాట్లాడా. థర్డ్ అంపైర్ అతనిని వెనక్కి పిలిచాడు. హీత్ స్ట్రీక్ సజీవంగా, బాగా ఉన్నాడు’ అని హెన్రీ ఒలొంగ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన క్రికెట్ ఫాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ హీత్ స్ట్రీక్ బతికున్నాడా? లేదా? అనే అయోమయంలో పడ్డారు. అయితే ఒలోంగా తన మునుపటి ట్వీట్‌ను తొలగించారు. ఇక ఒలోంగా తన వాట్సాప్‌లో స్ట్రీక్‌తో ఇటీవలి చేసిన సంభాషణకు సంబందించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా పంచుకున్నారు.

Also Read: Asia Cup 2023: ఫైనల్‌లో ఒక్కసారి కూడా ఢీకొట్టని భారత్-పాకిస్తాన్.. ఆసియా కప్ ఆసక్తికర విషయాలు ఇవే!

ఏదేమైనా జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నతస్థాయికి చేర్చడంలో హీత్ స్ట్రీక్‌ కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే జట్టుకు వన్నె తెచ్చారు. జింబాబ్వే తరఫున 1993- 2005 మధ్య 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు. స్ట్రీక్‌ రెండు ఫార్మాట్లలో కలిపి 4,933 పరుగులు, 455 వికెట్లు తీశారు. జింబాబ్వే తరఫున టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు.. టెస్టుల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఆటగాడిగా ఇప్పటికీ రికార్డు అతడి పేరుపైనే ఉంది. హీత్ స్ట్రీక్‌ జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. అంతేకాదు 2016 నుంచి 2018 వరకు జింబాబ్వేతో పాటు దేశవాళీ లీగ్‌లలో కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ ఉన్నారు.

Show comments