దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శని, ఆదివారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణల్లో శనివారం, ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మరియు ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: పాకిస్థాన్‌కు వెళ్లి మరీ ఉగ్రవాదుల్ని హత మారుస్తాం..
ఇక ఏప్రిల్ 9 వరకు ఈశాన్య ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది.
ఇది కూడా చదవండి: IPL 2024: నేడు ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోటీ.. ఈ సారైనా బెంగళూరు గెలిచేనా..?
ఇక తెలంగాణలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం వర్షాలు కురవవని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో కురిసే వర్షాలతో హైదరాబాద్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
ఇదిలా ఉంటే జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని సూచించింది. అత్యవసర పరిస్థితులైతేనే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, గ్లౌజులు వేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని వెళ్లాలని పేర్కొంది. చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Railway Jobs: పది అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
