Site icon NTV Telugu

HealthTips : రేగు పండ్లు ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..

Regu Pandlu

Regu Pandlu

రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్.. పుల్లగా, తియ్యగా ఉంటాయి అందుకే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు. వీటితో పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును ఉపయోగించి చేసే కషాయాన్ని మలబద్దకం నివారణకు ఉపయోగిస్తారు.. వీటి ఆకులను నూరి గాయాల పై పూస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. బరువు పెరగడంలో, కండరాలకు బలాన్ని ఇవ్వటంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.. వీటిని చలికాలంలో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వస్తుందని అనుకుంటారు.. అదేం లేదని నిపుణులు చెబుతున్నారు.. ఈ సీజన్ లో ఎక్కువగా వచ్చే కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు..

ఇకపోతే ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. నిద్ర లేమి సమస్యను తగ్గించటంలో రేగి పండ్లు సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి. రేగు పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా ఉంటుంది. రేగులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుతుంది.. ఉదర సమస్యలకు చెక్ పెడుతుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version