NTV Telugu Site icon

Carrot Juice : క్యారెట్‌ జ్యూస్‌ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Carrot Juice

Carrot Juice

క్యారెట్‌లో ఉండే సుగుణాలు బహుశా ఇంకో వెజిటముల్‌లో ఉండవేమో. క్యారెట్‌ వంటకం గాను జ్యూస్‌ గాను మరియు పచ్చిగానే తినడానికి ఎంతో బాగుంటుంది. ఇందులో విటమిన్‌ ఎ,బీ,సీ,ఈ లతో పాటు పొటాషియం, ఐరన్‌, మెగ్నిషియం, సోడియం, మాంగనీస్‌, ఆయోడిన్‌ మరియు శరీరానికి ఎంతో ఉపయోగపడే కాల్షియం ఉన్నాయి. ఇది మన శరీరాన్ని అనేక రుగ్మతలనుండి కాపాడుతుంది.

Also Read : Make Up Tips: ఇలా చేస్తే మీ అందం రెట్టింపవుతుంది

అంతేకాకుండా క్యారెట్‌ మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంచే అనేక గుణాలు ఉన్నాయి. క్యారెట్‌ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త పోటును కంట్రోల్‌లో ఉంచడం ద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. సహజంగా క్యారెట్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కళ్ళకి మంచిది అని. ఇందులో ఉండే విటమిన్‌ ఎ అన్ని రకాల కంటి సమస్యలను దూరం చేస్తుంది. రోజూ క్యారెట్‌ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్‌ లో ఉండే విటమిన్‌ ఎ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్‌ కూడా నిరోధించే గుణాన్ని కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్‌ పెడుతుంది.

Also Read : Today (13-01-23) Business Headlines: మరో 43 జిల్లాల్లో హాల్ మార్కింగ్. మరిన్ని వార్తలు

క్యారెట్‌మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజు క్యారెట్‌ జ్యూస్‌ తీసుకోవటం ద్వారా వెంట్రుకలు కుదుళ్ల నుండి గట్టిపడతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలె సమస్య తగ్గుతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్‌ ఈ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంపై ఏర్పడ్డ మృతకణాలను తిరిగి పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజు క్యారెట్‌ జ్యూస్‌ తాగడం వల్ల నిగనిగ లాడే చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. నిద్ర లేమితో బాధపడే వారికి క్యారెట్‌ జ్యూస్‌ ఒక చక్కని ముందు. రోజు క్యారెట్‌ జ్యూస్‌ తీసుకోవటం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే ఇది మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో వీర్య వృద్ధిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. పచ్చి క్యారెట్‌ రోజు తినడం వల్ల ఆరోగ్యవంతమైన పళ్ళను పొందవచ్చు. జీర్ణ సంబంధమైన వ్యాధులు నివారించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క్యారెట్‌ను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments