Site icon NTV Telugu

Health Tips : ఈ జ్యూస్ ను తాగితే చాలు..రాత్రి పూట హాయిగా నిద్ర పడుతుంది..

Hpy Sleep

Hpy Sleep

మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులకు ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.. మనిషి సగటున రోజుకు 6 గంటలు మినిమం నిద్రపోవాలి.. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి..నిద్ర పోవడానికి సమయం పడుతుంది. కానీ మనం తప్పకుండా గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ ఉదయం ఉత్పాహంగా పని చేసుకోవచ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ నిద్ర పోవాలంటే మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే మన శరీరంలో ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి.. అప్పుడే నిద్ర బాగా పడుతుంది..

అయితే నిద్రలేమి సమస్య వల్ల జనాలు డాక్టర్లను సంప్రదిస్తారు.. అలా కాకుండా ఇంట్లోనే ఒక జ్యూస్ ను తయారు చేసుకొని తాగితే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పానీయన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో ఒక గ్లాస్ కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.దాంతో బాగా నిద్ర పడుతుంది..

ఒక్క జ్యూస్ ను మాత్రమే కాదు..భోజనాన్ని కూడా ఒక టైం కు తీసుకోవాలి.. త్వరగా భోజనం చెయ్యడం కూడా అలవాటు చేసుకోవాలి..రాత్రి పూట ఫోన్స్ కి, టివీలకు వీలైనంత దూరంగా ఉండాలి. దీంతో గాఢ నిద్ర సొంతం చేసుకోవచ్చు. అలాగే రోజూ సాయంత్రం 6 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఆలస్యంగా భోజనం చేసే అలవాటును వీలైనంత వరకు వదులుకోవాలి. త్వరగా భోజనం చేసి నిద్రించడం వల్ల మనం గాఢ నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా గాఢ నిద్రను పొందవచ్చని అధిక బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version