Site icon NTV Telugu

Health Tips : పచ్చి ఉల్లిపాయలను తింటున్నారా? ఇది తెలిస్తే అస్సలు ముట్టుకోరు..

Onions

Onions

ఉల్లిపాయలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.. అయితే కొంతమంది మాత్రం పచ్చి ఉల్లిపాయలను అలాగే తింటుంటారు. అలా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఉల్లిపాయలను ఎక్కువ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి ఉల్లిపాయలను సలాడ్, నూడుల్స్, చికెన్ ఫ్రై అంటూ చాలా ఆహారాల్లో తింటూ ఉంటారు. నిజానికి ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్యసమస్యల ముప్పు తప్పుతుంది. ఉల్లిపాయ రసం జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే పచ్చి ఉల్లిపాయలను తినడం మంచిది కాదు. ఫుడ్ అలెర్జీ కూడా ఉల్లిపాయల వల్ల వచ్చే అవకాశం ఉంది.కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి..

కొంతమందికి పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల అలెర్జీ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల అలెర్జీ వస్తే చర్మంపై దురద, దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్య కూడా రావొచ్చు. ఉల్లిపాయ వల్ల అలెర్జీ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి..

ఉల్లిపాయలలో విటమిన్ కె ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే ఇది రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చి ఉల్లిపాయలను ఎక్కువ మొత్తంలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వార్ఫరిన్ వంటి రక్తం సన్నబడటానికి మందులు తీసుకునే వ్యక్తుల్లో పచ్చి ఉల్లిపాయలు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది..

వీటిల్లో ఫ్రక్టాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలను కలిగించే ఒక రకమైన కార్బోహైడ్రేట్. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఉల్లిపాయలను తినకపోవడమే మంచిది..

ఇకపోతే ఉల్లిపాయలు తక్కువ అన్నవాహిక స్పింక్టర్ ను సడలించడంలో ప్రసిద్ది చెందాయి. అయితే దీనివల్ల కొంతమందిలో గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను అందిస్తాయి.. అలాగే ఉల్లిపాయలను తినడం వల్ల చెడు శ్వాస అంటే.. నోట్లో దుర్వాసన కూడా వస్తుంది.. అందుకే ఇవన్నీ ఆలోచించి ఉల్లిపాయలను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

 

Exit mobile version