వీకెండ్ వస్తే మందు, విందు తప్పనిసరిగా ఉండాలని బ్యాచిలర్స్ అనుకుంటారు.. అయితే బీర్ తాగడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుదని కొందరు అంటున్నారు. కానీ ఖాళీ కడుపుతో బీర్, ఆల్కహాల్‌తో తగని ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. బీరు తాగున్నప్పుడు స్టఫ్‌గా ఇలాంటి ఆహారాలను పొరపాటున కూడా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అసలు బీర్ తాగిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.. తీసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- మందు తాగుతూ మసాలా ఫుడ్ ను తినడానికి ఇష్టపడతారు చాలా మంది. మీకు తెలుసా ? చాలా కారంగా ఉండే ఆహారాలు చేదు రుచిని మార్చుతాయి. అందుకే ఇలాంటి కాంబినేషన్ ను ఇకపై ట్రై చేయకండి..
- ఖార్జురం..టానిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటున కూడా బీరుతో తినకండి.. లేకుంటే కడుపులో రాళ్లు రావచ్చు. ఆల్కహాల్‌తో మాత్రమే కాకుండా, ఏ రకమైన అధిక ప్రోటీన్ ఫుడ్‌తోనైనా బీర్‌కు దూరంగా ఉండాలి, లేకుంటే అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది..
- బీన్స్..ఆహారంలో శెనగలు లేదా పప్పులు ఏవైనా ఉంటే.. వాటిని బీరుతో తినడం మానుకోవాలి. వాటిని పొరపాటున కూడా తినకూడదు. బీన్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బీరుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ప్రమాదకరం..
- టమాటో.. పుల్లగా ఉంటుంది ఎందుకంటే అందులో టానిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పుల్లని టమాటోలను బీర్ లేదా ఆల్కహాల్‌తో వాడకూడదు. లేకుంటే అది చంచలత్వం, వాంతికి కారణం కావచ్చు..
- క్యారెట్ మాములుగా ఆరోగ్యానికి మంచిదే.. కానీ డ్రింక్ ప్లాన్ చేసినప్పుడు.. బీరుతో సలాడ్ తినకుండా ఉండండి. ఆల్కహాల్, క్యారెట్ కలయిక కాలేయానికి ప్రమాదకరమని తేలింది.
- రొట్టె, బ్రెడ్‌తో చేసిన ఆహారాన్ని బీరుతో తినకూడదు. ఈ రెండు ఉత్పత్తులు ఈస్ట్‌ను కలిగి ఉంటాయి. అప్పుడు మీ శరీరం అధిక మొత్తంలో తీసుకునే ఈస్ట్‌ను జీర్ణం చేయదు. దీని కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
చాక్లెట్‌లో కెఫిన్, కొవ్వు, కోకో కూడా ఉంటాయి. బీరుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.. - బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి అధిక సాల్టెడ్ స్నాక్స్‌ను నివారించండి. ఇది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఉప్పుగా ఉండే ఆహారాలు దాహాన్ని పెంచుతాయి. అలాగే, బీర్ మూత్రవిసర్జన ప్రభావాన్ని అధికం చేస్తుంది.. సో మీరు బీర్ తాగుతున్నప్పుడు ఈ పదార్థలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు..
