వినోదాన్ని పంచె వాటిలో టీవీ కూడా ఒకటి.. టీవిలో ఎన్నో రకాల ప్రోగ్రామ్ లు వస్తాయి.. ఈరోజుల్లో టీవీ లేని ఇల్లు అనేది లేదు.. స్మార్ట్ టీవీ లను ఎక్కువ వాడుతుంటారు.. వాటిలో వెబ్ సిరీస్ లు సినిమాలను చూస్తూ అర్ధరాత్రి అయిన చూసి పడుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది.. అలా టీవీ చూస్తూ నిద్రపోతే అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల టీవీ చూస్తూ నిద్రపోతున్న వారిపై ఓ యూనివర్శిటీ అనేక రకాల పరిశోధనలు జరిపింది.. ఆ అధ్యయనాల్లో నమ్మలేని నిజాలను బయటపెట్టింది.. అధ్యయనం ప్రకారం, గదిలో తక్కువ మొత్తంలో పరిసర కాంతితో నిద్రించే వ్యక్తులలో మధుమేహం, ఊబకాయం మరియు అధిక రక్తపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. రాత్రిపూట కాంతి మెలటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది పేలవమైన నిద్రతో ముడిపడి ఉంది మరియు మధుమేహం మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె పోటు వంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..
కొందరు నిద్రపోయే ముందు టీవీలో చూస్తున్న వాటి గురించి కూడా కలలు కంటారు. ఇది పేలవమైన నిద్ర నాణ్యతకు దారి తీస్తుంది.. టీవీ చూస్తూ పడుకున్నప్పుడు పడుకొనే భంగిమ తెలియదు దాంతో పొద్దున్న లేచినప్పుడు ఏదోక పక్కా పట్టేసినట్లు ఉంటుంది.. టీవీ నుండి కృత్రిమ నీలి కాంతికి గురికావడం వల్ల మెలటోనిన్‌ను అణిచివేస్తుంది, ఇది మీకు నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.. నిద్రలేమి సమస్యలతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారీ తీస్తుంది.. ఇది దృష్టిలో ఉంచుకొని టీవీ చూడటం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
